World No Tobacco Day 2023: పొగాకు ఒక జీవితమే కాకుండా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. అందుకే భారత ప్రభుత్వం పొగాకును కొన్ని బహిరంగ ప్రదేశాల్లో వినియోగించడం నిషేధికరించింది. అందుకే ప్రతి సంవత్సరం పొగాకు, ధూమపానం చేయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించేందుకు మే 31 తేదీన పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. పొగాకు వినియోగాన్ని తగ్గించుకుంటూ పోవడమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యమని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఈ దినోత్సవ ప్రత్యేకత ఏంటో పొగాకు వినియోగం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అన్ని దేశాల్లో ప్రభుత్వాలు పొగాకును వినియోగించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ప్రజల్లో ప్రకటన రూపంలో అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా పొగాకును వాడడం వల్ల భవిష్యత్తు తరాలకు ఎలాంటి నష్టాలు జరుగుతాయో ప్రజలకు ప్రభుత్వాలు తెలియజేస్తాయి. అంతేకాకుండా యువత పొగాకును వినియోగించకుండా పలు  కార్యక్రమాలు కూడా ప్రభుత్వాలు ఈ దినోత్సవం సందర్భంగా చేపడతాయి. 


Also read: IPL 2023 Winner: ఐపీఎల్ 2023 ఫైనల్ జీటీ వర్సెస్ సీఎస్కే చివరి ఓవర్‌లో ఏం జరిగింది, చెన్నై ఎలా గెలిచింది


ధూమపానం మానుకోవడానికి మేము ఈరోజు మీకు అందిస్తున్న కోట్స్ ఇవే..


✵ పొగాకు వల్ల వ్యాపార సంస్థలకు లాభాలు కలిగిన.. ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని గుగ్గిపాలు చేస్తుంది.


✵ పొగాకు మీ జీవితాన్నే కాకుండా మీ కుటుంబాన్ని రోడ్డుపాలు చేస్తుంది.


✵ సిగరెట్, తంబాకు వినియోగించడం ఫ్యాషన్ కాదు.. అది మీ మరణానికి దారి.. 


✵ పొగాకు వినియోగించడం వల్ల వచ్చేది వ్యాధి.. కానీ దానిని మానుకోవడం వల్ల వచ్చేది కుటుంబలో సుఖ సంతోషాలు.


✵ ధూమపానం మానుకుంటే మీరు జీవితం అంతా సుఖంగా గడపగలుగుతారు. అందుకే సిగరెట్, గుట్కా వద్దు.. జీవితమే ముద్దు..


Also read: IPL 2023 Winner: ఐపీఎల్ 2023 ఫైనల్ జీటీ వర్సెస్ సీఎస్కే చివరి ఓవర్‌లో ఏం జరిగింది, చెన్నై ఎలా గెలిచింది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook